For Advertisement Enquiries Please Contact +91 7901268899

మత్స్యానికి మహర్దశ 

img

నరసాపురం : మత్స్య పరిశ్రమ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది . పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలో తోలి ఫిషరీస్ యూనివర్శిటీకి నిధులు మంజూరు చేసింది .ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ విశ్వవిదాలయానికి తోలి విడతగా రూ.100 కోట్లు మంజూరు చేసింది .నరసాపురం మండలం తీర గ్రామం వేములదీవి ప్రాంతంలో 400 ఎకరాల్లో వర్సిటీ నిర్మాణం చేపడతారు .పరిపాలన భవనాన్ని 40 ఎకరాల్లో సమీపంలోని సరిపల్లి గ్రామంలో నిర్మిస్తారు . వీటికి స్ధల సేకరణ కూడా పూర్తయింది . విశ్వవిద్యాలయం నిర్మాణం , కోర్సుల నిర్వహణ , ప్రయోగాలు తదితర అంశాలకు ఐదేళ్ళలో రూ .400 కోట్ల వరకు ఖర్చు చేస్తారని అధికారులు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఆక్వా రంగానికి నిపుణుల కొరత తీరుతుంది .పెద్ద ఎత్తున పరిశోధనలకు , ఆక్వా రంగం అభివృద్ధికి వర్సిటీ దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు .దీని ద్వారా ప్రత్యక్షంగా 90 వేల మంది ఆక్వా రైతులు , పరోక్షంగా 8 లక్షల మంది ప్రజలు లబ్ది పొందుతారని అంచనా , మత్స్య శాఖకు సంబంధించిన అన్ని కోర్సులకు బోధన ఈ వర్సిటీ ద్వారానే సాగుతుంది .
ఆక్వా రంగానికి జగన్ సర్కారు దన్ను 
మత్య్స సంపద , ఆక్వా ఎగుమతుల్లోనే రాష్ట్రానికి ప్రత్యేక స్ధానం ఉంది . ఇక్కడి నుంచి దేశ , విదేశాలకు భారీగా ఆక్వా ఎగుమతులు జరుగుతాయి .ఆదాయం భారీగా సమకూరుతుంది .అయితే ఈ రంగం అభివృద్ధిపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు . దీంతో పూర్తి స్థాయిలో ఆదాయం రావడంలేదు నిపుణులు , హార్బర్ , ఇతర మౌలిక వసతులు ఉంటె ఎగుమతులు మరో 40 శాతం  పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు . నిపుణులు లేక ప్రయోగాలు , కొత్త ఆవిష్కరణలు లేవు .వైరస్ లు సోకకుండా , లాభదాయకంగా ఆక్వా సాగు చేయడం లాంటి ప్రయోజనాలు రైతులు కోల్పోతున్నారు . ఆక్వా నిపుణుల కొరత కారణంగా రాష్ట్రం ఏటా రూ. 25 వేల కోట్ల అదనపు ఆదాయం వచ్చే ఆక్వా , మత్స్య ఎగుమతుల అభివృద్ధి పై దృష్టి పెట్టింది . రాష్ట్రంలో మత్స్య  కారుల జీవన ప్రమాణాలు , మత్స్య ఉత్పత్తులను పెంచే చర్యలు చేపట్టింది మత్స్య కారుల వలసలను , నివారించడానికి రూ . 3,200 కోట్లతో రాష్ట్రంలో మేనేజరు ఫిషింగ్ హార్బర్ , మినీ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం వైస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు . ఇందులో భాగంగా నరసాపురం మండలం బియ్యపు తిప్పలో 600 ఎకరాల్లో రూ।350 కోట్లతో హార్బర్ నిర్మించనున్నారు .ఆక్వా హేతువులకు నిబంధనలు సరళతరం చేయడం , సబ్సిడీపై విధ్యుత్ అందించడం లాంటి చర్యలు జగన్ ప్రభుత్వం చేపట్టింది ఇప్పుడు విశ్వవిద్యాలయం ఏర్పాటకు చకచకా చర్యలు చేపడుతోంది.
source : sakshi

Languages

Shares

Related News