టంగుటూరు : రోజులు మారుతున్నా వనామీ రొయ్యల రైతులకు కష్టాలు మాత్రం తప్పడం లేదు . రెండుళ్లుగా ప్రతికూల వాతవరణం.. వైట్ గట్ , వైట్ స్పాట్ తదితర వైరస్ ల విజృంభణతో జిల్లాలో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. దీంతో గత సీజన్ లోనూ పంట సాగు చేయకుండా అనుకూలమైన జనవరి, పిబ్రవరి, పంట పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ, ప్రస్తుత పరిస్ధితుల్లో హేచరీల్లో రొయ్య పిల్లల ఉత్పత్తి తగ్గడం , సీడ్ ధర రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడంతో వారిఆశలు అడియాశలవుతున్నాయి. హెచ్చు ధరలు పెట్టి సాగు చేయాలని చూసినాసీడ్ దొరక్కపోవడంతో అవస్ధలు పడుతున్నారు. జిల్లాలో కోస్తా తీర ప్రాంత మండలాల్లో నాలుగు వేల మంది రైతులు సుమారు 20 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండుగా అందులో 95 శాతం వనామే ఉంటుంది. నాలుగేళ్ల క్రితం ఆక్వా సాగు పూర్తి అనుకూల వాతావరణలో రైతులకు లాభాలు పంచగా , రెండేళ్లు నుంచి రొయ్యలకు తెగుళ్లు సోకి నష్టాలు మూటగట్టుకున్నారు.నాలుగు నెలలుగా చెరువులను ఖాళీగా ఉంచి ... ఫిబ్రవరి నెలలో చెరువుల్లో రొయ్య పిల్లలను వదలడానికి సిద్ధమవుతుండగా హేచరీలు సీడ్ ధరలను రెట్టింపు చేశాయి. దీంతో ప్రారంభంలోనే సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత అక్టోబర్ , నవంబర్ నెలలో 20 పైసలు ఉన్న సీడ్ ధర ప్రస్తుతం 70 పైసలకు చేరడంతో ఎకరానికి రైతుపై అదనంగా రూ. లక్ష భారం పడుతోంది . మెన్నటి వరకూతెగుళ్ల బారిన పడిన రొయ్యల చెరువులు తుడిచిపెట్టుకుపోవడం ,ఎగుమతైన ఉత్పత్తులో యాంటీబయోటిక్స్ అవశేషాలున్నాయన్నకారణంతో రొయ్యల కంటైనర్లు విదేశాల నుంచి తిరిగిరావడం ,వ్యాపరుల కుటమితొ ధరలు తగ్గిపోయి రైతులు త్రీవ నష్టాలు చవిచూశారు. ప్రస్తుతం సీడ్ ధర ఆకాశన్ని అంటడంతో ప్రాధమిక స్ధాయిలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిరావడంతోరైతులు సాగుకు వెనకడుగు వేస్తున్నారు.
తగ్గిన ఉత్పత్తి
జిల్లాలో 28 హేచరీచరీలు ఉండగా కోస్టల్ ఆక్వా కల్చర్ అధారటీ అనుమతి తో వనామీ రొయ్య పిల్లల ఉత్పత్తికిఅవసరమైన తల్లి రొయ్యలు అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఇక్కడకు దిగుమతి చేసుకుంటారు. అక్కడ గత ఏడాది సంభవించిన తుఫాను కారణంగా తల్లి రొయ్యలు చనిపోవడంతో ఉత్పత్తి తగ్గింది హేచరీల్లో సీడ్ ను ఉత్పత్తి చేయాలంటే సముద్రపు నీరు కీలక . రొయ్య పిల్లల ఉత్పత్తికి సముద్రపు నీటిలో 30 శాతానికి పైగా లవణ శాతం ఉండాలి.అది 25 శాతానికి పడిపోవడంతో పిల్లల ఉత్పత్తికి ఇబ్బందికర పరిస్ధితులు ఏర్పడ్డాయి. శీతాకాలం కావడంతో సముద్రం నీట్లో ఉప్పుశాతం తగ్గి హేచరీల్లో సీడ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. గోదావ్రి, కృష్టా జిల్లాలో సాగు గణీనయంగా పెరగడంతో వనామీ రొయ్య పిల్ల ధర పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అనుకూలమైన సమయం కావడంతో రైతులంతా ఒకేసారి పెద్ద ఎత్తున సాగుకు సిద్దం చేసుకోవడం కూడా పిల్లల ఉత్పత్తి పై పడింది.సాగుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Source : eenadu