For Advertisement Enquiries Please Contact +91 7901268899

శీతలంలోనూ రొయ్య పదిలం

img

 ఈశాన్య రుతు పవనాల ప్రభావం తో తరచూ తుఫాన్లు , అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి . ఈ కారణంగా ఆక్వా చెరువుల్లో పలు రకాల సమస్యలు తలైతే అవకాశం ఉంది . చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వీటిని అధిగమించి నాణ్యమైన పంట ఉత్పత్తిని సాధించవచ్చని ఒంగోలు మత్స్య శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వీవీ రంగనాధ బాబు తెలిపారు .అక్టోబర్ - డిసెంబర్ నెలల మధ్య శీతల వాతావరణం ఉంటుంది . దీని వల్ల రొయ్యల చెరువుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది . ముఖ్యంగా రాత్రి వేళల్లో సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది . దీనివల్ల రొయ్య జీవక్రియల్లో మార్పులు చోటు చేసుకుని ఆకలి మందగిస్తుంది . ఫలితంగా ఆహారం తక్కువ తింటాయి . పగటి సమయంలో వేసిన ఆహారం తిన్నాయా లేదా అన్న విషయాన్ని రైతులు పరిశీలించాలి . ఆహారం తినకుండా ఉంటే రాత్రి వేళ మేత తక్కువగా వేయాలి . లేకుంటే మిగులు ఆహారం కుళ్లి ... ఆమ్మోనియా , నైట్రోజన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది .తద్వారా రొయ్యలు వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశం  ఉంది .
రోజంతా వర్షం కురిసే సమయంలో చెరువుల్లోని మలినాలు కూడా వేరు పడతాయి .

Languages

Shares

Related News