డాలర్ల కొద్ది మారకం రాబట్టే పంటల్లో అగ్రస్ధానం ఆక్వాదే. రెండెంకెల వృద్ధిలోనూ దీనిచే ప్రాధాన్యం .అందుకే ప్రభుత్వం ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు వివిధ రాయితీ పధకాలను ప్రవేశ పెట్టింది. జిల్లాలో అధికారికంగా, అనధికారికంగా సుమారు 20 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా. సాగులో మంచి దిగుబడులు కోసం రైతులు రాత్రింబవళ్ళు కష్టపడి మూడు,నాలుగు నెలల్లో ఉత్పత్తులను తీస్తున్నారు. అన్నీ బాగుండి కాల కలిసివస్తే.. రొయ్యతో పాటు రైతు కూడా మీసం మెలేసేసాగు ఇది. రూపాయి పెట్టుబడికి రూ. మూడు లాభంతో లక్ష్మిదేవి వరిస్తుంది. వాతావరణం ప్రతికూలించినా రొయ్య పిల్లలో నాణ్యత లొపించినా అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందే .. అందుకే ఇలాంటి ఒడిదుడుకుల నుంచి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఆక్వా సాగులో యాంత్రీకర్ణకు 50 శాతం రాయితీని అందించాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో వివిధ పరికరాలు వాటికి రాయితీలపై కధనం.
జిల్లాలో అయిదు జోన్ల ఏర్పాటు జులై నుంచి అమలుకురంగం సిద్ధం:
జిల్లాలో విచ్చలవిడిగా ఆక్వా చెరువుల తవ్వకాలు జరుపుతున్న నేపధ్యంలో అనధికార సాగును నియంత్రించడంతో పాటు ప్రభుత్వ రాయితీ పధకాలను అందించేందుకు మత్స్యశాఖ అధికారులు ఆక్వా జోన్లను ఏర్పాటు చేశారు.
జోన్ 1: చీరాల, వేటపాలెం, చినగంజాం ,
జోన్ 2: నాగలుప్పలపాడు, ఒంగోలు , కొత్తపట్నం
జోన్ 3: టంగుటూరు, సింగరాయ కొండ
జోన్ 4: ఉలవపాడు, గుడ్లూరు
జోన్ 5: అద్దంకి, దర్శి , మండ్లమూరు
ఏరియేటర్లు:
మంచి నీటి రొయ్యల పెంపకం చేపట్టే యజమానులకు ఏరియేటర్లు 50 శాతం రాయితీపై ఇస్తారు. ఒక్కో యంత్రం ధర రూ. 40 వేలు కాగా, అందులో 20 వేలరాయితీ ఉంటుంది. రెండు హెక్టార్లు లోపు ఉన్న రైతులకు నాలుగు చొప్పున మంజూరు చేస్తారు.
సౌర ఏరియేటర్లు:
మంచి నీటి రొయ్యల పెంపకానికి అవసరమైన సోలార్ ఏరియేటర్లును ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. సోలార్ ఏరియేటర్ ధర రూ.2.50 లక్షలు కాగా . అందులో రూ. 1.25 లక్షల రాయితీ లభిస్తుంది. రైతుల అవసరం మేరకు 2 అశ్విక సామర్ధ్యం కలిగిన ఏరియేటర్లునాలుగు; 4 అశ్విక సామర్ధ్యం కలిగిన ఏరియేటర్లు రెండు మంజూరు చేస్తారు.
సౌరశక్తి వినియోగానికి:
ఆటోఫీడ్ డిస్పెన్సరీ:
రొయ్య పెరగాలంటే.. దానికి అందించే మేత నాణ్యమైనదై ఉండాలి రైతు ఒకరకంగా మేత కోసమే అధిక పెట్టుబడి పెడతారు. మేత నాణ్యమైనది కాకపోతే ఎంత వేసినాదిగుబడి రాదు. అందుకే మేత నాణ్యత తెలుసుకోపోవడం ముఖ్యం.ఇందుకొసం ప్రభుత్వం సోలార్ ఆటోపీడ్ డిస్పెన్సరీ పరికరాన్ని అందిస్తోంది. దీని ఖరీదు రూ. 60 వేలు కాగా, అందులో రూ .30 వేలు రాయితీ లభిస్తుంది.
పంపుసెట్లు :
రొయ్యల చెరువుల్లో నీటిని తోడుకునేందుకురైతులు ఎక్కువ ఖర్చు భరించాల్సి వస్తోంది. ఇంధనం ఖర్చుతో పాటు విధ్యుత్తు బిల్లు అధికమే . పెట్టుబడులు పెరగడానికి ఇదో కారణంగా చెబుతున్నారు. రైతులు . యూనిట్ ఖరీదు రూ. 5 లక్షలు కాగా , అందులో రూ. 2.50 లక్షల రాయితీ ఉంటుంది.
సౌర దీపాలు :
ఆక్వా సాగు అంటే .. పంట తీసే వరకూరైతులు అప్రమత్తంగా ఉండాలి. రాత్రి, పగలు చెరువుల వద్దనే ఉండాల్సిన పరిస్ధితి . రాత్రి వేళ విధ్యుత్తులేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.సమస్యను అధిగమించేందుకు 24 వాట్స్ ఎల్ ఈ డీ బల్బుతొ పాటూ ,12 అడుగుల విధ్యుత్తు స్తంభం ఏర్పాటుకు రూ. 18 వేలు ఖర్చవుతుంది.ఇందులో రూ. 9 వేలు రాయితీ లభిస్తుంది.
Source : eenadu