రొయ్యకు కనీస ధర ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ ఆఖరు దాకా ఇదే ధరపై కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేసింది. కౌంటు వారీగా ఎంత ఇస్తారనేది శుక్రవారం ప్రకటిస్తామని మార్కెటింగ్ , గిడ్డంగులు , మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. ఆయన అధ్యక్షతన సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మత్స్యశాఖ , ఎంపెడా అధికారులు, ఎగుమతి వ్యాపారులు , పలు జిల్లాల నుంచి రైతులు హాజరయ్యారు. రొయ్యల ధర పతనంపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వారు ఎదుర్కొంటున్నసమస్యలను బుధవారం జరిగే మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. విధ్యుత్తు సరఫరాలో నాణ్యత మెరుగుపరిచేందుకు 220 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు అంశంపై కూడా చర్చిస్తామన్నారు. కేంద్రం తరుపున ఇతర దేశాలతో సంప్రదింపులు జరపడంపైనా లేఖ రాస్తామన్నారు. యాంటిబయోటిక్స్ ఉపయోగించే వారిపై క్రిమినల్ కేసులతో పాటూ పీడీ చట్టం ప్రయోగిస్తామని మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్టా ద్వివేది చెప్పారు. ఈ సమావేశంలో ఇటు రైతు , అటూ ఎగుమతిదారులకు అనుకూలంగా ఉండేలా కనీస ధర ఇవ్వడంపై అధికారులు చర్చించారు. కొదరు ముఖ్యలు హాజరుకాలేదని వ్యాపారులు వివరించారు. వారితో మాట్లాడి గురువారంనాటీకి చెబుతామని వెల్లడించారు. అనంతరం శుక్రవారం ప్రభుత్వపరంగా ప్రకటన చేయవచ్చని అనడంతోఅధికారులు అంగీకరించారు.అంతర్జాతీయ విపణీలో భారీగా ధర తగ్గితే తప్ప ఇందులో ఎలాంటి మార్పు చేయకూడదని స్పష్టంచేశారు. అసలు ఎగుమతి ధరలు ఎంతో బయటపెట్టాలని పలువురు రైతులు డీమాండ్ చేశారు . ఎంపెడా కూడాదీనిపై వివరాలు ఇవ్వడం లేదని అసంతృప్తి వెల్బుచ్చారు. ఉత్పత్తివ్యయం రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. 100 కౌంటురొయ్యకు రూ. 230 ఖర్చువుతుంటే రూ. 160 కంటేతక్కువే ఇస్తున్నారని వివరించారు. నెలలో మూడూ సార్లు పడిపోయిందని గతంతో పోలిస్తే 28 శాతం ధర తగ్గిందని వివరించారు. రైతులు వస్తే ఆకౌంటు రొయ్య అవసరం లేదని చెబుతున్న వ్యాపారులు దళారులు ద్వరా వెంటనే కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులే మధ్యవర్తకులకు అమ్ముతున్నారని ఎగుమతి వ్యాపారులు అనడంతో వాగ్వాదం జరిగింది . పరిస్ధితిఇలాహే కొనసాగితే క్రాప్ హాలిడే తప్ప దని స్పష్టం చేస్తూ రైతులుసమావేశం నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా ముఖ్యకార్యదర్శి ద్వివేది జోక్యం చేసుకోని వారించారు రైతులు నష్టపోతేఆక్వా పరిశ్రమ భవిష్యత్తే ప్రశ్నార్ధకమవుతుందన్నారు.
Source: eenadu