For Advertisement Enquiries Please Contact +91 7901268899

చేపల సాగుకు మరో చేప సిద్ధం

img

చెరువుల్లో పెంచడానికి అనువుగా ఉండే కొత్తరకం చేపను అభివృద్ధి చేయడానికి విశాఖలో ని కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్ధ రెండెళ్ళుగా చేస్తున్న ప్రయోగాలు విజయవంతమయ్యాయి. చెరువుల్లో నీళ్లను ఏడాది వరకు మార్చాల్సిన అవసరం లేకుండా కొత్త పరిజ్ఝానాన్ని అభివృద్ధి చేశారు. మన దేశం ఏటా వేల కోట్ల రూపాయల విలువైన రొయ్యలను ఎగుమతి చేస్తున్నా చేపల ఎగుమతుల్లో ఇంకా వెనుకబడే ఉంది. దీన్ని అధిగమించడానికి వీలుగా సీఎంఎఫ్ ఆర్ ఐ శాస్త్రవేత్తలు బొంతు చేపల్ని చెరువుల్లో పెంచడానికి వీలుగా అభివృద్ధి చేశారు. ఆప్రయోగం విజయవంతమైనట్టు ఏడాదికిందట ప్రకటించారు. తర్వాత ముక్కుడుపార రకం చేపలను చెరువుల్లో పెంచడానికి వీలుగా రెండేళ్ల కిందట ప్రయోగాలు ప్రారంభించారు. సముద్రం నుంచి మేలుజాతి ముక్కుడుపార రకం చేపల్ని తెచ్చి వాటి పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నాయో విస్తృతంగా  పరిశోధించారు. అవి పరిశోధనశాలలో వేగంగా బరువు పెరగడానికి అనుకూలమైన పరిస్ధిల్ని కృత్రిమంగా సృష్టించారు. మొదట్లో వివిధ కారణాలతో చేప పిల్లలు చనిపోయేవి. కారణాలను అన్వేషిస్తూ మళ్లీ మళ్లీ పెంచారు. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని చెరువుల్లో ఎలా పెరుగుతున్నాయన్న అంశాన్నికూడా పరిశీలించేందుకు కృష్టా జిల్లాలోని నాగాయలంకలో పెంచారు. అక్కడా చక్కగా పెరగడంతో ప్రయోగాలు విజయవంతమైనట్లు నిర్ధారించుకున్నారు. ఆగ్నేసియా దేశాల్లోనూ, భారతదేశంలోని కేరళ, పశ్చిమ బంగా రాష్ట్రాల్లోనూ వీటికి మంచి గిరాకీ ఉంది . మనిషి ఆరోగ్యానికి ,ప్రత్యేకించి  గుండె పనితీరు సమర్ధంగా ఉండడానికి అవసరమైన మంచి పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ చేపలు ఉప్పునీటిలో పెరుగుతాయి. ఇప్పటి వరకు  చేపల చెరువుల రైతులు ఎదుర్కొనే సమస్యచెరువుల్లోని నీటీని మార్చడం . చేపలుపెంచే క్రమంలో వాటివ్యర్ధాలతో కాలుష్యం తలెత్తుతుంటుంది. దీన్ని అధిగమించడానికి నీటిని మార్చాలి. వేరే చోట నుంచి నీటిని తెప్పించి నింపడానికి  చాలా వ్యయమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చెరువులోని నీటీనిఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా రీ సర్క్యులేటీంగ్ ఆక్వాకల్చర్ సిస్టం పేరిట ఒక పరిజ్ఝానాన్ని అభివృద్ధి చేశారు. వాస్తవానికి  వ్యయం అత్యధికం. ఈ నేపధ్యంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వివిధ రకాల ఆర్ ఏఎస్ వ్యవస్ధలను అధ్యయనం చేసి వాటిఆధారంగా కేవలంరూ.13 లక్షలకే చేపల రైతులకుఅనుకూలంగాఉండేలా ఆధునాతన వ్యవస్ధను అభివృద్ధి చేశారు. అందులో తల్లి చేపలు ఏపుగాపెరుగుతుండటంతో  ఈపరిజ్ఝానం  కూడా విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. చెరువుల్లో పెంచేందుకు ముక్కుడుపారచేపను అభివృద్ధి చేయడం ,చేపల చెరువుల్లో నీటీని సంవత్సరం వరకు మార్చాల్సిన అవసరం లేకుండాచేసిన ప్రయోగాలు  రెండూవిజయవంతమయ్యాయి అని  సీఎంఎఫ్ ఆర్ ఐ శాస్త్రవేత్త, డాక్టర్ శుభదీప్ వెల్లడించారు.
Source: eenadu
 

Languages

Shares

Related News